Breaking News

భారత వ్యతిరేక కథనంపై స్పందించిన అమెరికా

Published on Tue, 04/09/2024 - 11:55

న్యూయార్క్‌: పాకిస్తాన్‌లో వరుస ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందని ఇటీవల యూకేకు చెందిన ఓ వీడియా సంస్థ ఆరోపణలు చేస్తూ కథనం వెల్లడించింది. అయతే తాజాగా ఆ కథనంపై అగ్రరాజ్యం  అమెరికా స్పందించింది. ఇటువంటి ఆరోపణలను తీవ్రతరం చేసుకోకుండా ఇరు దేశాలు.. చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది.

భారత్‌పై వచ్చిన ఆరోపణలపై ఆమెరికా వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు యూఎస్‌ విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ స్పందించారు. ‘పాకిస్తాన్‌లోని వరుస ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వేనుక భారత్‌ హస్తం ఉందని వెలువడిన కథనం మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆరోపణలపై మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయిలేం. మేము ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన విషయంలో జోక్యం చేసుకోలేం. అదే విధంగా ఇటువంటి ఆరోపణలను ఇరు దేశాలు సైతం తీవ్రతరం చేసుకోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అని మాథ్యూ మిల్లర్‌ అన్నారు. 

2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్‌ పాటిస్తోందని యూకేకు చెందిన ‘దీ గార్డియన్‌’ న్యూస్‌పేపర్‌ ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్‌, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్‌ పత్రిక పేర్కొనటం గమనార్హం.

అయితే ‘దీ గార్డియన్‌’ పేపర్‌ ఆరోపణలను భారత్ విదేశాంగ శాఖ.. తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికలో ఉ‍న్నది తప్పుడు సమాచారమని, ఇదంతా భారత్‌ వ్యతిరేక ప్రచారమని  పేర్కొంది.  ఇతర దేశాల్లో టార్గెట్‌గా హత్యలు  చేయటం భారత ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేసింది.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)