Breaking News

Illegal Immigrants: ఎవరేమన్నా.. ఐ డోంట్‌ కేర్‌!

Published on Tue, 01/28/2025 - 09:52

వాషింగ్టన్‌:  అక్రమ వలసవాదుల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. వారం రోజుల్లోనే సుమారు మూడున్నర వేల మందిని అరెస్ట్‌ చేసి వెనక్కి పంపించారు(డిపోర్టేషన్‌). అందులో ఈ రెండ్రోజుల్లోనే రెండు వేలమందిపై చర్యలు తీసుకోవడం గమనార్హం. దీంతో.. సరైన పత్రాల్లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు.  అయితే..

అయితే.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే క్రమంలో అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంటోంది. పలు నగరాల్లో ఇళ్లలోకి, ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతోపాటు చేతులకు బేడీలు వేసి అమానవీయంగా సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పైగా  ఆ విమానంలో తాగునీరు లాంటి కనీస వసతులు కూడా కల్పించడం లేదనే ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఖండిస్తున్నాయి.

మరోవైపు.. ఎఫ్‌ 1 వీసాల ఆధారంగా వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వణికిపోతున్నారు. యూనివర్సిటీలతో, తమ కోర్సులతో సంబంధం లేకుండా.. ఖర్చుల కోసం పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

అయితే.. ఏదిఏమైనా.. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ చర్యలు ముందుకు కొనసాగుతాయని ట్రంప్‌ స్పష్టం చేస్తున్నారు. సరైన పత్రాల్లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్దఎత్తున విమానాల ద్వారా స్వదేశాలకు తిప్పి పంపే చర్యలు కొనసాగుతాయన్నారు. అయితే.. ఆ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ట్రంప్‌ దారికి తెచ్చుకుంటుండడం గమనార్హం.

సరిహద్దున ఉన్న మెక్సికోతోపాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్‌సాల్వడార్‌ వంటి దేశాలుఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే..ఇప్పుడు వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)