Breaking News

అమెరికన్‌ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది.. యూఎస్‌ కీలక నేత సెటైర్లు

Published on Sat, 08/30/2025 - 09:00

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల విషయంలో స్వదేశం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌ చర్యలను ఇప్పటికే పలువురు నేతలు తప్పుపట్టగా.. తాజాగా ఆ లిస్టులో అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ కూడా చేరిపోయారు. ట్రంప్‌ సుంకాల నిర్ణయాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్‌ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌ చర్యలు అమెరికాకు తీరని నష్టం కలిగిస్తోంది. మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. పలు దేశాలు అమెరికాను తమకు విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారు. ట్రంప్‌ చర్యలు చైనాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్‌ తప్పుల కారణంగా భారత్‌ కూడా చైనా వైపు చూస్తోంది.

అమెరికాకు మిత్ర దేశమైన భారత్‌పై పెద్ద మొత్తంలో సుంకాలు విధించడంతో.. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో, భారత్‌.. బీజింగ్‌తో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇ‍ప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్‌ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది. భారత్‌పై ట్రంప్‌ భారీ వాణిజ్య దాడి చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఢిల్లీ ఇప్పుడు చైనాతో కలవాలని చూస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో.. భారత్‌పై ట్రంప్‌ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)