Breaking News

పక్కా సమాచారంతోనే దాడి

Published on Mon, 03/02/2026 - 02:15

శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించడం సంచలనాత్మకంగా మారింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్‌తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్‌లిస్ట్‌లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.

డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత వేట మరింత ముమ్మరంగా సాగింది. టెహ్రాన్‌ నడి»ొడ్డున ఖమేనీ నివాసంలో శనివారం తెల్లవారుజామున కీలక సమావేశం జరుగబోతున్నట్లు సీఐఏకు సమాచారం అందింది. ఖమేనీతోపాటు సీనియర్‌ నేతలు, సైనికాధికారులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. సీఐఏ వెంటనే ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వాలు మంతనాలు జరిపాయి. తెల్లవారకముందే చిమ్మచీకట్లోనే దాడికి దిగాలని తొలుత భావించారు. ఉదయం అయితే ఆపరేషన్‌ కచ్చితంగా విజయవంతం అవుతుందన్న ఉద్దేశంతో తెల్లవారిన తర్వాత దాడులకు టైమ్‌ ఫిక్స్‌ చేశారు.

సమాచారం ఇచ్చిందెవరు?  
ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కాప్స్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇందులో ఖమేనీ వ్యతిరేకులు కూడా ఉన్నా­రు. అతడి కదలికల గురించి వారే అమెరికా సీఐఏకు సమాచారం చేరవేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీపై దాడికి ఎంచుకున్న సమయానికి కూడా యూదు మతంలో కొంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల 2న యూదులకు పూరిమ్‌ సెలవుదినం. ఇదొక పండు­గ రోజు. ప్రాచీన కాలంలో యూదులను అంతం చేయడానికి అప్పటి పర్షియా(నేటి ఇరాన్‌) పాలకులు సాగించిన కుట్ర ఇదే రోజున విఫలమైంది. సరిగ్గా ఈ పండుగకు ముందు ఖమేనీని అంతం చేయడం గమనార్హం.

కీలక నేతలు, అధికారులు హతం
ఖమేనీ నివాసం చుట్టూ నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నిజానికి ఇదొక భారీ కాంపౌండ్‌. ఇందులో ఖమేనీ కార్యాలయాలు, ఇరాన్‌ ప్రభుత్వ కార్యాలయాలు, నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫీసులు ఉన్నా­యి. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌కు ఇదొక గుండెకాయ అని చెప్పుకోవచ్చు. ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కాప్స్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మొహమ్మద్‌ పాక్‌పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్‌ నజీర్‌జాదే, మిలటరీ కౌన్సిల్‌ అధినేత అడ్మిరల్‌ అలీ షామ్‌ఖనీ, ఐఆర్‌జీసీ ఏరోస్పేస్‌ ఫోర్స్‌ కమాండర్‌ సయ్యద్‌ మాజిద్‌ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్‌ మంత్రి మొహమ్మద్‌ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు.

క్షణాల్లోనే శిథిలాలుగా..  
ఉన్నతస్థాయి వర్గాల నుంచి ఆదేశాలు అందిన వెంటనే స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు తమ స్థావరాల నుంచి గాల్లోకి లేచాయి. రెండు గంటల ఐదు నిమిషాల్లో.. ఇరాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు టెహ్రాన్‌కు చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌ లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లు ఖమేనీ కాంపౌండ్‌ను శిథిలాలుగా మార్చేశాయి. ఖమేనీతోపాటు అక్కడే ఉన్న సైనికాధికారులు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సైనికాధికారుల ఒక భవనంలో, ఆ పక్కనే మరో భవనంలో ఖమేనీ ఉన్నారు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ రెండూ నామరూపాల్లేకుండాపోయాయి. లక్ష్యం ఎక్కడా గురితప్పలేదు. అంతా అనుకున్నట్లుగానే పూర్తయ్యింది. ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతోపాటు అమెరికా క్షిపణులు, డ్రోన్లు కూడా ఉపయోగించినట్లు సమాచారం. అమెరికా యుద్ధనౌకల నుంచి తోమహక్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లను ప్రయోగించారు. ఖమేనీ కదలికలను తమ నిఘా వర్గాలు సక్సెస్‌ఫుల్‌గా ట్రాక్‌ చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)