Breaking News

అణు కార్యక్రమంపై ముగిసిన ఇరాన్‌–అమెరికా  ప్రతినిధుల భేటీ

Published on Sun, 04/13/2025 - 06:07

మస్కట్‌: ఇరాన్, అమెరికా ప్రతినిధుల ముఖాముఖి మొదటి విడత చర్చలు శనివారం ఒమన్‌ రాజధాని మస్కట్‌లో ముగిశాయి. ఇరాన్‌ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు వీరు వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండోసారి ఎన్నికయ్యాక మొదటి విడత చర్చలు పూర్తయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ టీవీ తెలిపింది. అమెరికా ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు ఇరాన్‌ వార్తా సంస్థ పేర్కొంది. 

కాగా, ఈ నెల 19వ తేదీన తదుపరి విడత పరోక్ష చర్చలు జరుపుతామని అరగ్చి తెలిపారు. ‘ఫలితం లేని ఈ చర్చలతో సమయం వృథా. వీటిపై ఎవరికీ ఆసక్తి లేదు’అని పేర్కొన్నారు. మస్కట్‌ శివారులోని ఓ భవనంలో సమావేశమైన రెండు దేశాల ప్రతినిధులు రెండు గంటలపాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు ముఖాముఖి జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతినిధి విట్కాఫ్‌ తెలపడం గమనార్హం. అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమన్నదే తమ లక్ష్యమని ఇరాన్‌కు తెలిపినట్లు విట్కాఫ్‌ అంటున్నారు.   

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)