Breaking News

ఇండియన్‌ ట్రావెల్‌ ఏజెంట్లపై ఆంక్షలు! 

Published on Thu, 05/22/2025 - 06:12

వాషింగ్టన్‌: అమెరికాను మరోసారి గొప్పదేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియక హడలిపోతున్నారు. అక్రమ వలసదారుల పేరిట 300 మంది భారతీయులను ఇటీవల అమెరికా నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. 

అమెరికాలోకి భారతీయులు అక్రమంగా అడుగుపెట్టడానికి ఇండియన్‌ ట్రావెల్‌ ఏజెంట్లే ధనదాహమే కారణమని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే సదరు ట్రావెల్‌ ఏజెంట్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ‘‘అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తున్న ఏజెంట్లను గుర్తించే పనిలో మిషన్‌ ఇండియాకు సంబంధించిన కాన్సులర్‌ అఫైర్స్‌ అండ్‌ డిప్లొమాటిక్‌ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం’’అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

 అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్‌ ట్రావెల్‌ ఏజెన్సీల యజమానులు, ప్రతినిధులపై వీసా ఆంక్షలు విధించడానికి చర్యలు చేపట్టామని స్పష్టంచేసింది. ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని తేలి్చచెప్పింది. మనుషుల స్మగ్లింగ్‌ అనేది పెద్ద నేరమని వెల్లడించింది. అమెరికాకు రావాలనుకుంటే ముందు తమ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని విదేశీయులకు సూచించింది. చట్టాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అక్రమంగా వలస వచ్చినవారికే కాకుండా.. అలా రావడానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయని ఉద్ఘాటించింది.  

హెచ్‌–1బీ వీసాలు రద్దు చేయాలి  
మరోవైపు హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలోని అతివాదుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వీసాలను ఎందుకు రద్దు చేయకూడదని అధికార డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారు లారా ఎలిజబెత్‌ లూమర్‌ ప్రశ్నించారు. చట్టపరమైన ఈ తాత్కాలిక వర్క్‌ వీసాలతో భారతీయులు ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. హెచ్‌–1బీ వీసాలను రద్దు చేయాలంటూ ట్రంప్‌ మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అక్రమ వలసదారులను బయటకు పంపిస్తున్నాం, బాగానే ఉంది.. మరి హెచ్‌–1బీ వీసాదారుల సంగతేమిటి?’’అని లారా ఎలిజబెత్‌ లూమర్‌ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

 ‘‘హెచ్‌–1బీ వీసాల కుంభకోణాన్ని ట్రంప్‌ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోట్లాది మంది అమెరికన్లకు అసంతృప్తే మిగులుంది’’అని మరో పౌరుడు పోస్టు చేశాడు. గత 30 ఏళ్లుగా కుంభకోణం జరుగుతోందని ఆరోపించాడు. టెక్నాలజీ కంపెనీలు ఈ స్కామ్‌ను అడ్డం పెట్టుకొని వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని విమర్శించాడు. అవే కంపెనీలు 2020లో ట్రంప్‌ను ఓడించాయని చెప్పాడు. అమెరికన్ల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ చీఫ్‌ లేబర్‌ను కానుకగా ఇస్తున్నాడని మండిపడ్డాడు. విదేశీయులను బయటకు వెళ్లగొట్టి, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్‌ చేశాడు. మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) గ్రాడ్యుయేట్లతో ఈ పని ప్రారంభించాలని చెప్పాడు. అమెరికాను అమ్మకానికి పెట్టొద్దని ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరాడు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)