Breaking News

మాస్కోలో భారీ దాడి?.. అమెరికా హెచ్చరికతో హై అలర్ట్‌!

Published on Sun, 11/01/2026 - 07:26

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో భారీ ప్రాణనష్టానికి దారితీసే దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. ప్రముఖ మ్యూజియం, పార్క్‌ సముదాయమైన త్సారిట్సినో మ్యూజియం రిజర్వ్‌ వద్ద దాడి జరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం భద్రతా హెచ్చరిక జారీ చేసింది. దాడికి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందిందని ఎక్స్‌ వేదికగా ప్రకటించింది.

దాడి ముప్పు నేపథ్యంలో ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా ఎంబసీ సూచించింది. అప్రమత్తంగా ఉండాలని, జనసమూహాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ ముప్పుపై రష్యా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. దాడికి ఎవరు ప్రణాళిక రచిస్తున్నారనే విషయాన్ని అమెరికా వెల్లడించలేదు. ముప్పునకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా బయటపెట్టలేదు. అయితే, హెచ్చరికలో పేర్కొన్న ప్రాంతం మాస్కోలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కావడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

అమెరికా నుంచి అందిన సమాచారాన్ని రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎఫ్‌ఎస్‌బీ) ధ్రువీకరించింది.  దీనిపై తగిన చర్యలు కొనసాగుతున్నాయని ఎఫ్‌ఎస్‌బీ తెలిపింది. మాస్కోలో దాడులకు సంబంధించి అమెరికా గతంలోనూ రష్యాకు నిఘా సమాచారాన్ని అందించింది. 2024 మార్చిలో ఐసిస్‌-కె ఉగ్రవాద సంస్థ మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్‌పై దాడి చేయడానికి కొన్ని వారాల ముందే అమెరికా హెచ్చరించింది. ఆ దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

మాస్కో దక్షిణ ప్రాంతంలో త్సారిట్సినో మ్యూజియం రిజర్వ్‌ ఉంది. ఇది పురాతన సామ్రాజ్య కాలం నాటి రాజభవనం, పార్క్‌ సముదాయం. ముఖ్యంగా వారాంతాల్లో పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి ప్రాంతంలో దాడి ముప్పు హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో ఫ్లోరిడాలోని తన ట్రంప్‌ నేషనల్‌ డోరల్‌ రిసార్ట్‌లో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని వ్యాఖ్యాత బెన్నీ జాన్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇదీ చదవండి: రాజధానిలో టెన్షన్‌.. టెన్షన్‌.. అంతటా పోలీస్‌ పహరా!

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)