Breaking News

రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు 

Published on Thu, 08/07/2025 - 05:58

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్‌తో చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా స్టీవ్‌ విట్కాఫ్‌ను పంపించారు. విట్కాఫ్‌ బుధవారం ఉదయం మాస్కోలో పుతిన్‌తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. ట్రంప్‌ సందేశాన్ని విట్కాఫ్‌ ఈ సందర్భంగా పుతిన్‌కు చేరవేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సన్నద్ధం కావాలని, కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. 

పుతిన్, విట్కాఫ్‌ మధ్య సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని రష్యా విదేశాంగ ప్రతినిధి యూరి ఉషకోవ్‌ తెలిపారు. ఇరుపక్షాలు సానుకూల సంకేతాలు పంపించుకున్నాయని వివరించారు. వ్యూహాత్మక సహకారంపై చర్చించుకున్నాయని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, పుతిన్‌తో చర్చల అనంతరం విట్కాఫ్‌ బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని రష్యన్‌ మీడియా తెలియజేసింది. అయితే, పుతిన్, విట్కాఫ్‌ తాజా చర్చలపై అమెరికా, ఉక్రెయిన్‌ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాను ట్రంప్‌ తీవ్రంగ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)