Breaking News

పర్యాటకులు అమెరికాలో ఎప్పటిదాకా ఉండొచ్చు?

Published on Fri, 12/19/2025 - 05:44

వాషింగ్టన్‌: ఫలానా తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు అంటూ స్వయంగా అమెరికా ప్రభుత్వమే టూరిస్ట్‌ వీసాను జారీచేసినాసరే ఆ తేదీకంటే ముందే చాలా సందర్భాల్లో స్వదేశానికి వెనుతిరగాల్సి ఉంటుందని ట్రంప్‌ సర్కార్‌ కొత్త మెలిక పెట్టింది. వాస్తవానికి ఈ విషయం వీసా సంబంధ నిబంధన పత్రంలో ఉంటుందని తన వితండవాదాన్ని సమర్థించుకునే ప్రయత్నంచేసింది. 

ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘‘ అంతర్జాతీయ పర్యాటకులకు ముఖ్య గమనిక. అమెరికాలో ఎన్ని రోజుల వరకు పర్యటించవచ్చు అనేది మీకు జారీచేసిన టూరిస్ట్‌ వీసా మీద పేర్కొన్న గడువు తేదీ నిర్ణయించబోదు. గడువును అమెరికా కస్టమ్స్, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నిర్ణయిస్తారు. మీరు అమెరికాలో అడుగుపెట్టగానే మీతో ఆయన ఒక ఐ–94 దరఖాస్తును నింపిస్తారు. 

అందులో మీ చట్టబద్ధ పర్యాటకానికి చివరి తేదీ రాసి ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలంటే https:// i94.cbp.dhs.gov/ home  వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో మీ టూరిస్ట్‌ వీసా సంబంధిత వివరాలను సరిచూసుకోండి. ఐ–94 దరఖాస్తులో ‘అడ్మిట్‌ అన్‌టిల్‌ డేట్‌’ అని ఒక తేదీ రాసి ఉంటుంది. అదే మీ చట్టబద్ధ పర్యటనకు ఆఖరి గడువు తేదీ. టూరిస్ట్‌వీసా గడువు తేదీ, ‘అడ్మిట్‌ అన్‌టిల్‌ డేట్‌’ తేదీలు ఒకేలా ఉండాలనే నియమం ఏమీలేదు. సాధారణంగా టూరిస్ట్‌వీసా గడువు కంటే ముందుగానే ‘అడ్మిట్‌ అన్‌టిల్‌ డే’ ముగుస్తుంది’’ అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)