ఇరాన్‌ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!

Published on Sun, 06/22/2025 - 11:30

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్‌.. ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెలీ అవీవ్‌, ఇతర ప్రాంతాలను టార్గెట్‌గా ఇరాన్‌ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్‌ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా బాంబు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్‌ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్‌ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను మీడియా ఛానెల్‌ ప్రసారం చేసింది.

ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ..
మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసి ఇరాన్‌ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు సమాచారం. ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌ గగనతలాన్ని మూసివేసింది. జూన్‌ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్‌ విమాన సర్వీసులను రద్దు చేసింది.

'హార్ముజ్ జలసంధి' మూసివేత!
ఇదిలా ఉండగా.. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్‌ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది. 

 భారత్‌పై ఎఫెక్ట్‌.. 
ఇరాన్‌ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడ్డ భారత్‌ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్‌ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్‌ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)