Breaking News

భారత్‌ తర్వాతే మాకు ఎవరైనా: అమెరికా

Published on Mon, 01/12/2026 - 15:21

ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రంప్‌ పన్నుల మోతతో ఇరు దేశాల మధ్య డిస్టెన్స్ కొద్దిగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూఎస్ రాయబారి సెర్గియా గోర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాకు భారత్‌ తర్వాతే ఏదేశమైనా అని అన్నారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. 

డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక భారత్‌కు అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని అంతా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు కావడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగపడతాయనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించడం, తనవల్లే రెండుదేశాల మధ్య యుద్ధం ఆగిందని తరుచుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత్ ఖండించినా ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొంటే అధిక పన్నులు వేస్తానని బెదిరించారు. ఇలా అమెరికాతో డిస్టెన్స్‌ పెరుగుతూ వచ్చింది. 

ఈ నేపథ్యంలో భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ ఈ రోజు( సోమవారం) బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్రైపాక్షిక సంబంధాలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. " డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం నిజమైనది. కనుక వారిమధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారి పరిష్కరించుకుంటారు. అమెరికాకు భారత్ అంత కీలకమైన దేశం మరేదిలేదు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

తాను ట్రంప్‌తో చివరిసారి డిన్నర్ చేసినప్పుడు ట్రంప్ తన చివరి భారత పర్యటన వివరాలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోదీతో మైత్రి అపూర్వమని ఆయన అన్నారని తెలిపారు. భారత్, అమెరికా మధ్య రెండవ దశ ట్రేడ్‌ డీల్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాయబారిగా భారత్-అమెరికా మధ్య సరైన ఎజెండా రూపొందించడం రాయబారిగా తన బాధ్యతని సెర్గియా గోర్ పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)