Breaking News

వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్‌ ఎంపీ పంచ్‌ల వర్షం

Published on Fri, 05/05/2023 - 12:47

అంకారా: రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్‌ ఎంపీ దాడి చేశారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యతో ఆగ్రహానికిలోనైన ఉక్రెయిన్‌ ఎంపీ.. అతడిపై దాడికి దిగాడు. ముఖంపై పంచ్‌ ఇచ్చి.. గాయపరిచాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

టర్కీ దేశ రాజధాని అంకారాలోని  గ్లోబల్‌ సమ్మిట్‌ జరుగుతోంది. బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక, ఈ సమ్మిట్‌కు పలువురు రష్యా ప్రతినిధులు, ఉక్రెయిన్‌ ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో సమ్మిట్‌కు హాజరైన ఉక్రెయిన్‌ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవ్స్కీ తమ దేశ జెండాను ప్రదర్శించాడు. 

ఇదే సమయంలో అటుగా వస్తున్న రష్యా ప్రతినిధి ఒకరు ఓవరాక్షన్‌ చేశారు. ఒలెక్సాండర్‌ చేతిలోని జెండాను ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్‌ ఎంపీ.. అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. పిడిగుద్దులు గుద్దుతూ రష్యా ప్రతినిధిని చావబాదాడు. అక్కడే ఉన్న ఇతర అధికారులు వీరిని అడ్డుకున్నారు. అనంతరం రష్యా ప్రతినిధి చేతిలోని జెండాని ఎంపీ లాక్కున్నాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: మరో ఆప్షన్‌ లేదు.. లొంగిపోతానన్నా వినొద్దు.. జెలెన్‌స్కీని మట్టుబెట్టాల్సిందే!

Videos

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)