Breaking News

మరణశయ్యపై తల్లి.. కూతురి దుర్మార్గంపై కోర్టు కన్నెర్ర

Published on Fri, 03/07/2025 - 10:17

కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది . 

యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

కేసు ఇదే..
మార్గరేట్‌ బేవర్‌స్టాక్‌(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్‌ లండన్‌ కౌంటీ కోర్టులో పిటిషన్‌ వేశాడు.

తన తల్లి  2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్‌ ఇవాన్స్‌.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది.  తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది. 

దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్‌కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్‌కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)