ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇద్దరు భారతీయుల మృతి

Published on Wed, 06/12/2024 - 07:26

మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరగుతున్న యుద్ధంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. వారు రష్యా ఆర్మీ సైనికులుగా సేవలు అందిస్తున్న క్రమంలో మరణించినట్లు  తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశి వ్యవహారాల  శాఖ వెల్లడించింది. మృతి చెందిన వారి బాడీలను ఇండియాకు పంపించాలని రష్యాను భారత విదేశాంగశాఖ కోరింది. మృతి చెందినవారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 

‘‘ భారత్‌లోని రష్యన్‌ అంబాసిడర్‌ ద్వారా మాస్కో​లోని ఇండియన్ ఎంబసి ఈ విషయంపై చర్యలు చేపట్టింది. అదే విధంగా రష్యన్‌ ఆర్మీలో ఉన్న భారతీయులను విడుదల చేసి ఇండియాకు తిరిగి పంపించాలని కోరాం. భవిష్యత్తులో రష్యన్‌ ఆర్మీలో భారతీయులను చేర్చుకోవటం నిలిపివేయాలని డిమాండ్‌ చేశాం’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

రష్యాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ స్పందిస్తూ.. ‘‘ రష్యా  ఆర్మీలో సహాయకులుగా పనిచేసే ఉద్యోగాలకు భారతీయులు వెళ్లవద్దు. ఇటువంటి నియామకాలు నకిలీవి, చాలా ప్రమాదకరమైవి’’ అని ఆయన తెలిపారు.

మార్చిలో భారత విదేశాంగ శాఖ.. రష్యాలో వెళ్లే భారతీయులను హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా మిలిటరీలో ప్రమాదకరంగా ఉండే ఉద్యోగాలు చేరటం మానుకోవాలని తెలిపింది. ఇటువంటి నియామకాల్లో చాలా జగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)