Breaking News

నార్వే ప్రధాని లేఖలో తేల్చిచెప్పిన ట్రంప్

Published on Mon, 01/19/2026 - 16:22

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ టంప్‌కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా  ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ  ‌పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్‌కు దక్కలేదు. 

తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్‌పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్‌కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న  విధ్వంసానికి  కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.

ఆలేఖలో ట్రంప్ ...  "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా  గుర్తించలేదు.  అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్‌లాండ్‌కు ఎప్పటికైనా  చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.

అయితే గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్‌తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్  ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు.  నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు. 

    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)