డొనాల్డ్‌ ట్రంప్‌లో అసహనం..

Published on Fri, 12/12/2025 - 16:05

ఇటీవల  కాలంలో పలు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాయకుల మధ్య మాటల దాడి హెచ్చుమీరుతోంది.  ఈ పరిణామాలను చూస్తే గతంలోనే వరల్డ్‌ వార్‌-3 వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావించారు. దేశాల మధ్య సఖ్యత చెదిరి, యుద్ధాలకు దారి తీస్తున్న పరిస్థితులే వీటన్నంటికీ కారణం. అటు రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ మొదలుకొని నేటి పాకిస్తాన్‌-ఆఫ్గాన్‌ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల్ని చూస్తే ఏదో ఉపధ్రవం రాబోతుందా? అని పగటు ప్రజానీకం ఉలిక్కిపడిన సందర్భాలు  చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ట్రంప్‌లో అసహనం.. 
మరొకవైపు ‘శాంతి-శాంతి’ అని చెప్పుకునే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాల్లో వరల్డ్‌ వార్‌-3 అంటూ వ్యాఖ్యానించారు కూడా. మళ్లీ తాజాగా ట్రంప్‌ అదే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయన్‌ల మధ్య  యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ యుద్ధం కారణంగా గత నెలలోనే సుమారు 25 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారని, అందులో ప్రజలు, సైనికులు కూడా ఉన్నారన్నారు.ఆ యుద్ధాన్ని తక్షణమే ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణం కావొచ్చని హెచ్చరించారు. 

ఆ ఇర దేశాల నేతాలకు ఎన్నిసార్లు చెప్పినా యుద్ధాన్ని ఏదొక రూపంలో ముందుకు తీసుకెళుతున్నారే కానీ దాన్ని ముగించాలనే ఆలోచన చేయడం లేదంటూ వైట్‌హౌస్‌ వేదికగా మీడియా సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు ట్రంప్‌.

ఇక మాటల్లేవ్‌.. అంతా యాక్షనే..!
అంతకుముందు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధంపై ట్రంప్‌ చాలా ఆందోళనగా ఉన్నారన్నారు. అది ట్రంప్‌కు విపరీతమైన చిరాకు తెప్పిస్తుందన్నారు. ఇరుదేశాలు ఒక సఖ్యతకు వచ్చి యుద్ధం ఆపకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్నారు. ఇక రష్యా- ఉక్రెయిన్‌లతో మాట్లాడాలని ట్రంప్‌ అనుకోవడం లేదని, ఇక కేవలం చర్యలతోనే ఇరు దేశాలకు సరైన సమాధానం చెప్పాలని ట్రంప్‌ భావిస్తున్నారన్నారు. 

భారత టూరిస్టులకు షాకిచ్చిన ట్రంప్‌..

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)