Breaking News

ఇరాన్‌పై బాంబులు వేస్తా : ట్రంప్‌

Published on Wed, 06/17/2026 - 16:36

వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధం ముగింపుకు శ్రీకారం చుడుతూ.. ఈనెల 19న అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మరో రెండు రోజుల్లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని, ఆ ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులు వేస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించాయి. వంద రోజులకు పైగా యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా-ఇరాన్‌ల మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. మధ్యవర్తులుగా పాకిస్థాన్, ఖతర్ వ్యవహరిస్తున్నాయి. రెండు రోజులలోనే ఒప్పందంపై సంతకాలు జరగనున్న తరుణంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఒప్పందం కుదిరిన వెంటనే హర్మూజ్‌ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందానికి అణు ఆయుధాలే సాక్షాలు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగవు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌ అణు ప్రోగ్రామ్‌ నిలిపివేయాలని, యురేనియం నిల్వలను తొలగించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు ఒప్పుకుంటూ ఇరాన్‌ ఒప్పందంపై సంతకాలు చేయాలి. లేదంటే ఆ దేశంపై బాంబులు వేయిస్తామని స్పష్టం చేశారు.    

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పందిస్తూ.. ‘ఎంఓయూ కేవలం ప్రారంభం మాత్రమే. అణు ప్రోగ్రామ్‌పై భవిష్యత్‌ చర్చలు కొనసాగుతాయి అని అన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే యుద్ధం నిలిచిపోతుందని, హర్మూజ్‌  జలసంధిలో కార్యకలాపాలు ఇరాన్‌-ఒమాన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆయన తెలిపారు.

ఇరాన్‌ జాతీయ భద్రతా మండలి కూడా లెబనాన్‌తో సహా అన్ని ఫ్రంట్‌లలో యుద్ధం తక్షణమే నిలుస్తుందని, నావికాదళ ఆంక్షలు తొలగించబడతాయని ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు హర్మూజ్‌ జలసంధి కీలకమని, ఒప్పందం తర్వాత చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యుద్ధంలో ధ్వంసమైన గ్యాస్‌, ఆయిల్‌ ఫీల్డ్స్‌ పునరుద్ధరణకు నెలలు పట్టవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)