Breaking News

దయలేని ట్రంప్‌.. ఈసారి సినిమాపై సుంకం

Published on Mon, 05/05/2025 - 08:21

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్‌ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.

కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్‌.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్‌ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.

చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన.  అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్‌.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు. 
 


ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్‌ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్‌ వార్‌’లో భాగంగా హాలీవుడ​ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్‌ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. 

బెడిసికొట్టే అవకాశం?
ట్రంప్‌ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్‌, వార్నర్‌ బ్రోస్‌ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)