Breaking News

చైనాకు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌

Published on Thu, 10/30/2025 - 10:31

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెత్తబడ్డారు. చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం దక్షిణ కొరియా బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. జిన్‌పింగ్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని ఈ సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  

జేపీ మోర్గాన్‌ నివేదిక ప్రకారం.. 2018 దాకా చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0-5 శాతంగా ఉండేవి. అయితే 2021లో అది 20 శాతానికి చేరింది. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి టారిఫ్‌ వార్‌ మొదలుపెట్టాక చైనా విషయంలోనూ పెంపు ఉండొచ్చని అంతా భావించారు. అందుకు తగ్గట్లే అది 57 శాతానికి చేరింది. అయితే ఆ పెంపు 155 శాతం దాకా ఉంటుందని.. నవంబర్‌ 1వ తేదీ నుంచి అమలు అవుతుందని ఆయన హెచ్చరించారు కూడా. ఈలోపు..

పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా గురువారం ఈ ఇరు దేశాధినేతలు రెండు గంటలపాటు సమావేశం కాగా, చర్చలు ఫలవంతం అయ్యాయి. తాజా తగ్గింపుతో సుంకాలు 47 శాతానికి చేరాయి. 

ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక అద్భుతమైన ఆరంభం అని ఈ సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యానించారు. టారిఫ్‌ తగ్గింపుతో పాటు సోయాబీన్‌ కొనుగోళ్ల పునరుద్ధరణ, అలాగే.. రేర్‌ ఎర్త్‌ ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇంతకు మించి ఏం చెప్పలేనన్న ఆయన.. ముఖ్యమైన అంశాలకు సంబంధించి వివరాలను కాసేపట్లో విడుదల చేస్తామని మీడియాకు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)