Breaking News

తైవాన్‌ విషయంలో చైనాపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sat, 10/19/2024 - 07:29

న్యూయార్క్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇరుపార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చైనా.. తైవాన్ జోలికి వెళ్లితే ఆ దేశంపై అదనపు సుంకాలను విధిస్తానన్నారు.

‘‘నేను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే చైనా.. తైవాన్‌ జోలికి వెళితే. నేను మీకు 150 శాతం నుంచి 200 శాతం వరకు పన్ను విధిస్తాను’’ అని అన్నారు. తైవాన్‌పై చైనా చేసే.. ఆక్రమణకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ఉపయోగిస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇప్పటివరకు అయితే.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తనను గౌరవిస్తున్నారని, అటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని  స్పష్టం చేశారు.

ఇటీవల ట్రంప్‌ దిగుమతి సుంకాల విషయంపై స్పందిస్తూ.. భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని అన్నారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్‌ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్‌లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని అన్నారు.

చదవండి:  తైవాన్‌ను దిగ్బంధించిన డ్రాగన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)