Breaking News

‘ఎప్‌స్టీన్ ఫైళ్లు'.. ట్రంప్‌ సంచలన ప్రకటన

Published on Thu, 11/20/2025 - 07:49

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్లను బహిరంగంగా విడుదల చేయాలంటూ న్యాయ శాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన సోషల్ మీడియా పోస్ట్‌లో  ఆయన.. ‘మా అద్భుతమైన విజయాల నుండి దృష్టి మరల్చేందుకు ‘ఎప్‌స్టీన్ ఫైళ్లు' అంశాన్ని డెమొక్రాట్లు ఉపయోగించుకున్నారు’ అని  ఆరోపించారు.

‘ఎన్‌డీటీవీ’ అందించిన కథనంలోని వివరాల ప్రకారం ఈ బిల్లు ‘ఎప్‌స్టీన్ ఫైళ్లు పారదర్శకత చట్టం’ పేరుతో కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక మద్దతు పొందింది. మంగళవారం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో 427-1 ఓట్ల భారీ తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. ట్రంప్ వ్యతిరేకత తర్వాత కూడా రిపబ్లికన్లతో సహా మెజారిటీ చట్టసభ సభ్యులు ఈ పారదర్శకతకు మద్దతు తెలిపారు. ఈ పరిణామం ఎప్‌స్టీన్ బాధితులకు, ఈ కేసులోని నిజానిజాలు తెలుసుకోవాలని కోరుకుంటున్న ప్రజలకు  ఉపశమనం కలిగింది.

ఈ చట్టం ప్రకారం.. న్యాయ శాఖ (డీఓజే) ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అన్ని ఫైళ్లు, కమ్యూనికేషన్‌లను 30 రోజుల్లోపు విడుదల చేయవలసి ఉంటుంది. 2019లో ఫెడరల్ జైలులో ఎప్ స్టీన్ మరణంపై జరిగిన దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయాలని ఈ బిల్లు కోరుతోంది. ఎప్‌స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, అతని మరణంపై అనేక సందేహాలు, కుట్ర  కోణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటన కీలకంగా మారింది. అయితే ఈ బిల్లులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తుల కోసం ఎప్‌స్టీన్ బాధితులకు సంబంధించిన కొన్ని సవరణలను (Redactions) చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అంటే రాజకీయంగా ఎంతటి సున్నితమైన లేదా ఇబ్బందికరమైన సమాచారం ఉన్నా, అది తప్పనిసరిగా బహిర్గతం చేయవలసి ఉంటుంది. త్వరలోనే ఎప్‌స్టీన్ ఫైళ్లు వెల్లడి కానుండటంతో, దీనిలో ఏయే ప్రముఖుల పేర్లు బయటపడతాయో అనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

ఇది కూడా చదవండి: ‘ఏడ్చినా.. పట్టించుకోను’.. టీచర్‌ వేధింపులకు విద్యార్థి బలి 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)