Breaking News

వాషింగ్టన్‌లో ఉగ్రదాడి!.. ట్రంప్‌ ఆగ్రహం

Published on Thu, 05/22/2025 - 10:34

అమెరికలో దౌత్య పరమైన విషాదం నెలకొంది.  ఓ ఆగంతకుడు జరిపిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్‌ ఎంబసీ(Israel Embassy Staff) సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లను హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చారు.

స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌ డీసీలోని యూదుల మ్యూజియం(Jewish Museum) వద్ద ఈ ఘోరం జరిగింది. మ్యూజియంలో ఓ ఉత్సవం జరుగుతుండగా..  ఎంబసీ స్టాఫ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. అంతలో.. అత్యంత సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనలో సిబ్బంది ఇద్దరు మరణించారు. 

కాల్పులకు పాల్పడ్డ దుండగుడు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ‘‘ ఫ్రీ పాలస్తీనా.. ఫ్రీ పాలస్తీనా(Free Palestine) ’’ అంటూ జెండా కప్పేసుకుని అక్కడే కూర్చుని నినాదాలు చేశాడు. దీంతో ఉగ్రదాడి కోణంలోనే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణతో.. గాజాలో తీవ్ర దాడులు(Gaza War) జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుండటంతో పాలస్తీనీయులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. ఈ పరిణామాల వేళ.. కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. 

జెవిష్‌ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని.. యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన ఈ తరహా దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారాయన. మరోవైపు ఘటనపై ఇజ్రాయెల్‌ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇతర దేశాల్లోని ఎంబసీలను మాత్రం అప్రమత్తం చేసినట్లు సమాచారం.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)