‘హాలీవుడ్‌లో కూడా..’.. మోదీపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

Published on Sat, 06/20/2026 - 08:33

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ది యాక్సియోస్ షో' ఇంటర్వ్యూలో తాను ఎంతగానో అభిమానించే ఇద్దరు ప్రపంచ నాయకుల పేర్లను అడుగుగా, ఆయన ఏమాత్రం తడుముకోకుండా మోదీ, జిన్‌పింగ్ పేర్లను వెల్లడించారు. ఈ ఇద్దరు నేతల రాజకీయ వ్యూహాలు, వారికున్న అంతర్జాతీయ పలుకుబడిని ట్రంప్ కొనియాడారు. హాలీవుడ్ సినిమాలు తీసినా వీరిలాంటి వ్యక్తులు దొరకరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

హాలీవుడ్ సినిమాల్లో కూడా దొరకరు
ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల నాయకత్వ పటిమపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పీఎం మోదీ అద్భుతమైన నాయకుడు. ప్రెసిడెంట్ షీ కూడా అంతే గొప్ప లీడర్. వీరంతా క్లాసిక్ లీడర్స్. ఒకవేళ వీరిద్దరి జీవితాలపై హాలీవుడ్‌లో సినిమా తీయాలనుకున్నా, వీరిలాంటి పాత్రలు పోషించే వ్యక్తులు అక్కడ కూడా దొరకరు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ చాలా తెలివైన వారని, అనవసరమైన యుద్ధాలకు దూరంగా ఉంటూ 150 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. భారత్‌తో ప్రస్తుతం అమెరికా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్సంబంధాలతో వ్యాపారం చేస్తోందని ఆయన అన్నారు.

స్థిరమైన నాయకత్వం.. 12 ఏళ్ల పాలన
భారతదేశంలో గతంలో ఉన్న రాజకీయ అనిశ్చితిని, ప్రస్తుత స్థిరత్వాన్ని ట్రంప్ పోల్చి చూశారు. ‘నేను నా జీవితకాలంలో భారతదేశాన్ని గమనిస్తూనే ఉన్నాను. అక్కడ గతంలో ప్రభుత్వాలు నిరంతరం మారుతూనే ఉండేవి. ఎవరో ఒకరు రావడం, ఆరు నెలలు లేదా ఏడాదిలోనే మారిపోవడం జరిగేది. కానీ, ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఆయన గత 12 ఏళ్లకు పైగా అత్యంత స్థిరంగా దేశాన్ని పాలిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటూనే ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

దేవదూతలా కనిపిస్తారు కానీ చాలా కఠినం
ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. మోదీ చర్చలు జరిపే విధానంపై ప్రశంసలు కురిపిస్తూ.. ‘మోదీ చాలా సీరియస్‌గా చర్చలు జరుపుతారు. ఆయనను చూస్తే చాలా ప్రశాంతంగా, ఒక దేవదూతలా కనిపిస్తారు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో, దేశ ప్రయోజనాల విషయంలో ఆయన అంతకంటే కఠినంగా వ్యవహరిస్తారు. చూడ్డానికి చాలా సౌమ్యంగా ఉంటారు. అందుకే ఆయన వ్యూహాలు ప్రత్యర్థులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి’ అని ట్రంప్ అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)