Breaking News

యుద్ధం వేళ మిత్ర దేశాలకు ట్రంప్‌ ఝలక్‌..

Published on Sun, 04/19/2026 - 13:06

వాష్టింగన్‌: ఇరాన్‌, అమెరికా యుద్ధం, ఉద్రిక్తత వేళ అధ్యక్షుడు ట్రంప్‌.. ఇజ్రాయెల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్‌.. అమెరికాకు అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశమని కితాబు ఇచ్చారు. అమెరికాకు గొప్ప భాగస్వామి అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ట్రంప్‌ ఇలాంటి ప్రకటన చేయడం విశేషం.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా.. ఇజ్రాయెల్ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా అమెరికాకు గొప్ప భాగస్వామి. అమెరికాకు ఇజ్రాయెల్‌ అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశం‌. ఇజ్రాయెల్ ప్రజలు ధైర్యవంతులు, తెలివైనవారు, సాహసవంతులు. ఇరాన్‌ యుద్ధం వంటి సంక్షోభం లేదా ఒత్తిడి సమయంలో ఇతర దేశాలు తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతుంటే, ఇజ్రాయెల్ మాత్రం గట్టిగా నిలబడి పోరాటం చేస్తోంది. విజయం ఎలా సాధించాలో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ఈ మద్దతు ప్రకటన వెలువడటం విశేషం.

ఇదిలా ఉండగా.. మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ మైత్రి బలపడుతుండగా, మరోవైపు ఇరాన్ చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. హార్మూజ్‌ జలసంధి మూసివేత వంటి నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)