Breaking News

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వార్‌.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్‌

Published on Wed, 10/02/2024 - 14:25

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. హమాస్‌, హెజ్‌బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ఇరాన్‌ ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకుంటోంది. శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించింది.

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ల యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరుదేశాల మధ్య సాగుతోన్న భీకర దాడులు ఇద్దరు చిన్నపిల్లల మధ్య కొట్లాటలా ఉందని అభివర్ణించారు. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరన్‌ జరిపిన రాకెట్‌ దాడి వంటి ఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో జరిగే సంఘటనలపై అమెరికా  మరింత లోతుగా జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు.

‘ఇది నిజంగా చెడు విషయం. కానీ, వారు ఆ యుద్ధ ప్రక్రియను పూర్తిచేయాలి. పాఠశాల ప్రాంగణంలోఇద్దరు చిన్నారులు కొట్లాడుకుంటున్నట్లు ఉంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందో వదిలేయాలి. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. ఇది భయంకరమైన యుద్ధం. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో మీకు తెలుసా? ఇజ్రాయెల్‌ దళాలు 200 రాకెట్లను కూల్చేశారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ప్రతిఒక్కరూ జీవించాలి. కాబట్టి ఈ అంశంపై అమెరికా మరింత దృష్టిపెట్టాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
చదవండి: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంపై భారత్‌ ఆందోళన చెందుతోంది: జై శంకర్‌

అయితే ఇరాన్‌ దాడుల అనంతరం ట్రంప్‌.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లపై విమర్శలు గుప్పించారు. వారు ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని పేర్కొన్నరు. తాను చాలాకాలంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నానని, తన అంచనాలు ఎప్పుడూ నిజమవుతాయని ఈసందర్భంగా ట్రంప్‌ పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మధ్యప్రాచ్యంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదన్నారు.

కాగా హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా హత్యతో పాటు ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ఇరాన్‌ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 200 క్షిపణుల్ని ప్రయోగించింది. అయితే వీటిలో చాలావాటిని అమెరికా మిలటరీ సాయంతో ఇజ్రాయెల్‌ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి.  ఇరాన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)