Breaking News

మాక్రాన్‌-బ్రిగెట్టా వీడియోపై ట్రంప్‌ ఫన్నీ.. డోర్‌ క్లోజ్‌ చేయాలంటూ..

Published on Sat, 05/31/2025 - 09:36

వాషింగ్టన్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇలాంటివి జరిగేటప్పుడు అక్కడ తలుపులు మూసి ఉన్నాయో.. తెరిచి ఉన్నాయో చూసుకోవాలి అని ఫన్నీ కామెంట్స్‌ చేశారు. అది చూసుకుంటే ఇలా సోషల్‌ మీడియాలో మనం ఉండం కదా.. అని చెప్పుకొచ్చారు.

అధ్యక్షుడు మాక్రాన్‌ ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తాజాగా ఓవల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై స్పందించాలని ఓ విలేకరి ట్రంప్‌ను కోరారు. ఈ సందర్భంగా ట్రంప్‌ స్పందిస్తూ.. దీని గురించి తాను నేరుగా మాక్రాన్‌తోనే మాట్లాడాను. అంతా బాగానే ఉందని తెలిపారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలి అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. మాక్రాన్‌-బ్రిగెట్టాల వియత్నాం పర్యటన సందర్బంగా హనోయ్‌ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం హనోయ్‌లో దిగిన తరవాత.. ఒక అధికారి తలుపును తెరిచినప్పుడు మాక్రాన్‌ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్‌ ధరించిన రెండు చేతులు మాక్రాన్‌ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కి జరిగారు. ఇది రికార్డు అవుతున్నట్లు గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్‌ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి మాక్రాన్‌ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి రెడ్‌ కార్పెట్‌ మీద పక్కపక్కనే నడిచారు.

అనంతరం, ఈ ఘటనపై మాక్రాన్‌ స్పందిస్తూ.. మా విషయంలో ప్రతీ ఒక్కరూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఎలాంటి మన‍స్పర్థలు లేవు. అప్పుడు నా భార్యతో నేను జోక్‌ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే అంటూ క్లారిటీ ఇచ్చారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)