Breaking News

వార్ పవర్స్ షాక్‌.. ట్రంప్‌ దూకుడుకు బ్రేక్‌

Published on Thu, 06/04/2026 - 06:37

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కీలక రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకుండా నియంత్రించే 'వార్ పవర్స్' (War Powers) తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌) ఆమోదించింది. 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం ట్రంప్‌ విదేశాంగ, సైనిక విధానాలపై కాంగ్రెస్‌ అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తున్నారు.

డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం.. అమెరికా సైన్యాన్ని యుద్ధంలో కొనసాగించడం లేదంటే కొత్త సైనిక చర్యలు చేపట్టడం కోసం కాంగ్రెస్‌(అమెరికా పార్లమెంట్‌) అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కాంగ్రెస్‌కే ఉందని ఈ తీర్మానం మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపడం కొసమెరుపు. 

ఎందుకు ఎదురుదెబ్బ?.. 
ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్‌ ఘర్షణలో ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక ప్రభావాలు కనిపించడం వల్ల అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార రిపబ్లికన్‌ పార్టీలోని నలుగురు సభ్యులు కూడా డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసారి విజయం
ఇదే తరహా తీర్మానం గతంలో పలుమార్లు సభ ముందుకు వచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. మే నెలలో జరిగిన ఓటింగ్‌లో 212-212తో సమం కావడంతో తీర్మానం విఫలమైంది. అయితే ఈసారి అదనపు మద్దతు లభించడంతో సభ ఆమోదం దక్కింది.

ఏం జరగబోతోందంటే..
హౌస్‌ ఆమోదించిన ఈ తీర్మానం ఇప్పుడు సెనెట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు తెలుపుతున్నప్పటికీ తుది ఫలితం ఆసక్తికరంగా మారింది. సెనెట్‌ ఆమోదించినా ట్రంప్‌ దీనిపై వీటో (Veto) విధించే అవకాశం ఉందని అమెరికా మీడియా నివేదిస్తోంది.

యుద్ధం వెంటనే ఆగిపోతుందా?
ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన యుద్ధం తక్షణమే ఆగిపోదు. అయితే కాంగ్రెస్‌ అనుమతి లేకుండా సైనిక చర్యలు కొనసాగించడంపై ట్రంప్‌ ప్రభుత్వంపై రాజకీయ, రాజ్యాంగపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అధ్యక్ష అధికారాలపై కాంగ్రెస్‌ తన నియంత్రణను పునరుద్ఘాటించినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ట్రంప్‌ దూకుడును కొంత మేర నియంత్రించే పరిణామంగా భావిస్తున్నారు.

కీలక అంశాలు

  • ఇరాన్‌పై సైనిక చర్యలను పరిమితం చేసే 'వార్ పవర్స్' తీర్మానం ఆమోదం

  • 215-208 ఓట్లతో హౌస్‌లో ఆమోదం

  • నలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతు

  • యుద్ధ నిర్ణయాలకు కాంగ్రెస్‌ అనుమతి తప్పనిసరి అనే సందేశం

  • సెనెట్‌ ఆమోదం, ట్రంప్‌ వీటోపై ఉత్కంఠ

  • ట్రంప్‌ విదేశాంగ విధానాలకు పెద్ద రాజకీయ హెచ్చరికగా విశ్లేషణ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)