Breaking News

ట్రంప్‌ సంచలన ప్రకటన

Published on Mon, 01/12/2026 - 08:39

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో స్వయంగా ఆయన ఒక పోస్ట్‌ చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన.. మొట్టమొదటిది కావడం గమనార్హం. 

 

డ్రగ్స్‌ అభియోగాలతో కూడిన నేరాలకుగానూ.. వెనెజువెలా రాజధాని కారకస్‌పై అమెరికా సైనిక చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీన రాజధాని నగరంపై మెరుపు దాడులు జరిపి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్‌లను బంధించి న్యూయార్క్‌కు తీసుకెళ్లింది. సుమారు 150 యుద్ధ విమానాలతో అమెరికా వెనెజువెలాపై నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్ని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

మదురో అక్రమ అరెస్ట్‌ తర్వాత వెనెజువెలా అధ్యక్ష స్థానంలో.. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీం కోర్టు. అయితే.. వెనెజువెలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ఆ సమయంలో ట్రంప్‌ ప్రకటించారు. ఈ ప్రకటనపై విమర్శలు రావడంతో.. వెనెజువెలాలో స్థిర ప్రభుత్వం కొలువుదీరేంత దాకా పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని మరో ప్రకటన చేశారు. 

ఇప్పటికే వెనెజువెలా చమురుపై సర్వహక్కులు తమవేనని.. ఏ దేశమైనా తమతోనే డీల్‌ కుదుర్చుకోవాలని ట్రంప్‌ అల్టిమేటం జారీ చేశారు.  అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి ప్రకటనకు అసలు చట్టబద్ధత ఉంటుందా? అనే ప్రశ్న మొదలైంది. 

గతంలో.. 
గతంలో కొందరు నాయకులు తమ దేశానికి రాజులుగా, అధ్యక్షులుగా ప్రకటించుకున్న ఉదాహరణలు ఉన్నాయి. నెపోలియన్‌ బోనపార్టే(ఫ్రాన్స్‌), అహ్మత్‌ జోగ్‌(అల్బేనియా), బోరిస్‌ స్కోసిరెఫ్‌(అండోరా).. ఈ లిస్ట్‌లో ఉన్నారు.  కానీ చరిత్రలోనే.. ఇలా ఒక దేశ అధ్యక్షుడు మరో దేశంపై అధికారాన్ని ప్రకటించుకున్న దాఖలాలైతే లేవు(మీ దృష్టిలో ఏదైనా ఉంటే.. సోషల్‌ మీడియాలో కింద కామెంట్‌ సెక్షన్‌లో తెలియజేయగలరు). కాబట్టి ట్రంప్‌ ప్రకటన అత్యంత అరుదైనదిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకటనపై వెనెజువెలా ప్రభుత్వం, ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)