Breaking News

మోదీ గొప్పోడే.. : ‍ట్రంప్‌ చిత్రమైన వ్యాఖ్యలు

Published on Thu, 10/16/2025 - 11:07

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రశంసలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని మోదీ తనకు మాట ఇచ్చారని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ గొప్ప వ్యక్తి అంటూనే ట్రంప్‌ విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశారు. 

మోదీ ఓ గొప్ప వ్యక్తి. భారత్‌ను ఎంతో కాలంగా నేను చూస్తున్నా. అది ఎంతో అద్భుతమైన దేశం. అలాంటి దేశానికి నా స్నేహితుడు అధినేతగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ఆయన ట్రంప్‌ను ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడ ప్రేమంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు అంటూ నవ్వుతూ అన్నారాయన. 

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తోందని.. ఈ చర్యతో ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు భారత్‌ అర్ధిక సహకారం అందిస్తోందని ట్రంప్‌ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారాయన. అయితే తాజాగా వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్‌ ఇక మీదట చమురు కొనదని మోదీ హామీ ఇచ్చారని ప్రకటించారు. 

ఇప్పటికప్పుడే కాకపోయినా.. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేస్తామని మోదీ తనతో చెప్పారని ట్రంప్‌ అన్నారు. అలాగే.. భారత్‌ నిర్ణయం ఉక్రెయిన్‌ యుద్ధం ఆపేందుకు కీలక ముందడుగు అని అభివర్ణించారాయన. అలాగే తన తదుపరి లక్ష్యం చైనానే అని ప్రకటించారాయన. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)