Breaking News

భారత్‌పై ట్రంప్‌ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Mon, 08/04/2025 - 09:38

వాషింగ్టన్‌: రష్యా-భారత్‌ వాణిజ్యంపై అమెరికా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్.. భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌పై ఆ దేశం చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. యుద్ధం ఆగాలంటే భారత్‌పై ఆంక్షలు తప్పవని తేల్చి చెప్పారు. దీంతో, ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ వాణిజ్యం కారణంగానే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో భారత్ దాదాపుగా చైనాతో సమానంగా ఉంది. భారత్‌ చేసుకుంటున్న దిగుమతులు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిధులు సమకూర్చడానికి సాయపడుతున్నాయి. ఇది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టతతో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, ఆయన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. 

అయితే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు కీలక భాగస్వామి అయిన భారత్‌పై ట్రంప్ వర్గం నుంచి ఇలాంటి విమర్శలు రావడం తీవ్ర చర్చకు దారి తీశాయి. కాగా, కొద్ది రోజుల ముందే ట్రంప్.. భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్‌, రష్యా వాణిజ్యంపై ట్రంప్‌ ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తూ డెడ్‌ ఎకానమీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. ఉక్రెయిన్‌లో శాంతి చర్చల దిశగా పురోగతి లేకపోతే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. భారత్, తక్కువ ధరకే లభిస్తున్న రష్యా ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రస్తుతం దేశ చమురు అవసరాల్లో మూడింట ఒక వంతుకు పైగా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, దేశ ఇంధన భద్రత, సార్వభౌమ నిర్ణయాల దృష్ట్యా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే, ట్రంప్‌కు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య చారిత్రాత్మకంగా బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని మిల్లర్ అంగీకరించడం గమనార్హం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)