Breaking News

24 గంటల్లో సుంకాల మోత

Published on Wed, 08/06/2025 - 04:49

న్యూయార్క్‌/మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దిక్కుతోచని స్థితితో భారత్‌పై తన ఆగ్రహాన్ని టారిఫ్‌ల రూపంలో తీర్చుకుంటున్నారు. మరో 24 గంటల్లో భారత్‌పై మరోమారు దిగుమతి సుంకాలను భారీగా పెంచుతానని ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. సుసంపన్న దేశమైన రష్యాకు భారత చమురు కొనుగోళ్ల కారణంగా మాత్రమే అపార లాభాల పంట పండుతున్నట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. కేవలం ఈ ఒక్క కారణాన్నే చూపి భారత్‌పై తన అక్కసును వెళ్లదీస్తూ మరోసారి సుంకాల మోత మోగిస్తానని సీఎన్‌బీసీ స్క్వాక్‌ బాక్స్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ ప్రకటించారు.

భారత్‌ నుంచి ఆర్జిస్తున్న చమురు లాభాల కారణంగానే ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా విజయవంతంగా నెలల తరబడి కొనసాగిస్తోందని ట్రంప్‌ మరోమారు నోరుపారేసుకున్నారు. తమతో కంటే రష్యాతోనే అధిక వాణిజ్యం చేస్తోందని, ఆ వాణిజ్యం పరోక్షంగా ఉక్రెయిన్‌ యుద్ధాగి్నకి ఆజ్యంపోస్తోందని ఆరోపించారు. ‘‘భారత్‌ ఇప్పటికీ మంచి వాణిజ్య భాగస్వామిగా ఎదగలేకపోయింది. భారత్‌ మాతో పెద్దస్థాయిలో వ్యాపారం చేస్తోందిగానీ మేం వాళ్లతో పెద్దగా వాణిజ్యం చేయట్లేదు.

అందుకే ఇప్పటికే ఇటీవల 25 శాతం టారిఫ్‌ను విధించా. మరో 24 గంటల్లో మరోసారి దిగుమతి సుంకాలను పెంచుతా. దీనికి ప్రధాన కారణం వాళ్లు రష్యా ముడి చమురును కొనుగోలు చేయడమే. అక్కడ ఇంధనాన్ని కొంటూ రష్యాకు నగదు ఇంధనాన్ని సమకూర్చుతున్నారు. ఆ ఇంధనంతో రష్యా యుద్ధయంత్రంగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ పద్దతి వాళ్లకు నచ్చుతుందేమోగానీ నేనైతే అస్సలు సంతోషంగా లేను’’అని అన్నారు.

భారత్‌తో వాణిజ్య సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మా సరకులపై భారత్‌ అత్యంత ఎక్కువ టారిఫ్‌లను మోపుతోంది. మేం టారిఫ్‌లు పెంచడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం’’అని చెప్పారు. ‘‘మా ఈ సుంకాల మోత తర్వాత భారత్‌ దిగిరావొచ్చు. మా సరకులపై సున్నా దిగుమతి సుంకాన్ని ఆఫర్‌చేయొచ్చు. కానీ ఇది మాకు ముఖ్యం కాదు. రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోళ్ల అంశమే మాకు ప్రధానం’’అని ట్రంప్‌ స్పష్టంచేశారు.  

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)