Breaking News

పాకిస్తాన్‌కు మరో షాక్‌.. ఆప్ఘన్‌ ఎఫెక్ట్‌తో కిలో టమాటా ఎంతంటే?

Published on Fri, 10/24/2025 - 13:28

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయ్‌. ఇరు దేశాల మధ్య దాడుల కారణంగా అక్టోబర్‌ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీంతో పాకిస్తాన్‌ ప్రజలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘర్షణల కారణంగా నిత్యవసరాలపై దీని ప్రభావం పడింది. పాక్‌లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగి ఏకంగా కిలో టమాటాల ధర (Tomato Prices) 600లకు చేరింది.

పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్థాన్‌ బోర్డర్‌ మూసివేత వల్ల ఇరుదేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాక్‌లో ప్రస్తుతం కిలో టమాటాల ధర (Tomato Prices) 600 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్‌ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. ఇక, గురువారం టమాట ధర ఎనిమిది వందలకు సైతం చేరినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ఇదిలా ఉండగా.. సాధారణంగా పాక్‌-ఆప్ఘన్‌‌ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు. ఆప్ఘన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయని పాకిస్థాన్‌లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారిగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)