Breaking News

‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’

Published on Fri, 05/16/2025 - 16:11

వాషింగ్టన్:  ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు  రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు.  అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో  భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్..  ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.

‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి  ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న  దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది.  ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా  సునాయాసంగా ఛేదించగలదనే  సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)