Breaking News

గల్ప్‌ దేశాలకు గుణపాఠం..

Published on Mon, 04/20/2026 - 11:03

ఇరాన్‌పై అమెరికా-ఉక్రెయిన్‌ దాడుల కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే ఇరాన్‌, అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. ఇటు ఇరాన్‌ ప్రతి దాడులతో గల్ప్‌ దేశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలకు అమెరికా ఇచ్చిన ప్రధాన భరోసా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ THAAD (Terminal High Altitude Area Defense) విఫలం కావడంతో గల్ప్‌ దేశాలకు కునుకు పట్టడం లేదు. భారీగా డబ్బులు వెచ్చించి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసినప్పటికీ ఇలా జరగడంతో పలు దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇజ్రాయెల్-అమెరికాలతో ఇరాన్ తనకున్న పరిమితి వనరులతోనే ధైర్యంగా పోరాటం చేస్తూ వ్యూహాత్మకంగా ఎదురుదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడి, శత్రువుల ఆయుధాలను నాశనం చేసింది. ఇదే సమయంలో గల్ప్‌ దేశాల్లో ఉన్న రక్షణ వ్యవస్థలను ఇరాన్‌ క్షిపణులు చేధించడం చర్చనీయాంశంగా మారింది. గల్ప్‌ దేశాలకు అమెరికా అందించిన అత్యాధునిక టెక్నాలజీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్‌,  Patriot PAC-3 లాంటి వ్యవస్థలను ఇరాన్‌ మట్టికరిపించింది.  

అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2025 మేలో రియాద్‌ వేదికగా గల్ప్‌ దేశాలతో 142 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.11.8 లక్షల కోట్)లు విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో THAAD, Patriot అప్‌గ్రేడ్‌లు, డ్రోన్లు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తయారు చేయబడ్డాయి. కానీ, ఇరాన్‌ క్షిపణి దాడులకు ఇవి నిలవలేకపోయాయి. అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేయగా, ఇరాన్ ప్రతీకారంగా 400 క్షిపణులు, 1000 డ్రోన్లు గల్ఫ్ దేశాలపై ప్రయోగించింది. 

దీంతో.. THAAD రాడార్లు (AN/TPY-2) జోర్డాన్, సౌదీ, యూఏఈలో నాశనం అయ్యాయి. Patriot వ్యవస్థలు కొంతమేర అడ్డుకున్నా, భారీ సంఖ్యలో వచ్చిన డ్రోన్లు, క్షిపణులను తట్టుకోలేకపోయాయి. సౌదీ, యూఏఈలోని ఎయిర్‌బేస్‌లు, ఇంధన సదుపాయాలు, పట్టణాలు నేరుగా దెబ్బతిన్నాయి. రక్షణ కోసం గల్ఫ్ దేశాలు ఖర్చు చేసిన వందల బిలియన్ల డాలర్లు ఆశించిన మేరకు రక్షణ ఇవ్వలేకపోయాయి. అమెరికా కవచం “ఇనుప గోడ” అని చెప్పబడినా వ్యవస్థ వాస్తవంలోకి రాగానే తుస్సుమనిపించింది.

ఇక, సెంటర్ ఫర్ స్ట్రాటజీక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. దక్షిణ కొరియా, గౌమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఒక్కో దాని విలువ 300 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,760 కోట్లు). ‘ఇవి చాలా విలువైన వ్యూహాత్మక వనరులు.. వీటిని కోల్పోవడం ఒక పెద్ద ఎదురు దెబ్బ’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో క్షిపణి రక్షణ నిపుణుడు టామ్ కరాకో అన్నారు. థాడ్ బ్యాటరీలో సాధారణంగా 90 మంది సైనికులు, ట్రక్కులపై అమర్చిన ఆరు లాంఛర్లు, మొత్తం 48 ఇంటర్‌సెప్టర్ క్షిపణులు (ప్రతి లాంచర్‌కు 8 వంతున), ఒక TPY-2 రాడార్‌తో పాటు టాక్టికల్ ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 13 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గగనతల, రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయాలంటే ఇదొక్కటే మార్గమని పసిఫిక్ ఫోరమ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుడు విలియమ్ అల్బెర్క్యూ అన్నారు.

ఇదిలాఉండగా.. ఇరాన్‌-అమెరికా యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ ముందు సీఎన్ఎన్ నివేదించింది. అనంతరం, ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు అమెరికా అధికారి సైతం ధ్రువీకరించారు.

THAAD బ్యాటరీ అంటే ఏమిటి? 
THAAD అనేది అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. స్వల్ప-శ్రేణి, మధ్యస్థ, దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనిని 'అమెరికన్ బ్రహ్మాస్త్ర' అని కూడా అంటారు. వాతావరణం లోపల, వెలుపలి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఏకైక వాయు రక్షణ వ్యవస్థ దీనికి కారణం. అందుకే అమెరికా THAAD సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుస్తుంది.

THAAD ఎలా పని చేస్తుంది? 

  • THAAD అనేది ఇన్‌కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను వాటి ఫ్లైట్ టెర్మినల్ దశలో (లక్ష్యానికి దగ్గరగా) మాత్రమే అడ్డుకునేలా రూపొందించబడింది.

  • THAAD షార్ట్, ఇంటర్మీడియట్ , ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది.

  • ఇందులో ఎలాంటి పేలుడు వార్‌హెడ్‌లు ఉండకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. 

  • ఇది గతిశక్తి (శక్తి వినియోగం) సహాయంతో లక్ష్యాలను నాశనం చేస్తుంది.

  • THAAD ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ప్రత్యేకంగా అమెరికన్ సైనికులచే నిర్వహించబడుతుంది.


THAAD ప్రధాన భాగాలు? 

  • THAADలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి, ఇందులో ఇంటర్‌సెప్టర్లు, లాంచర్లు, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లు ఉన్నాయి.

  • ఇంటర్‌సెప్టర్ ఇంపాక్ట్ ఫోర్స్‌ని ఉపయోగించి ఇన్‌కమింగ్ క్షిపణులను నాశనం చేయడంలో సహాయపడుతుంది, అయితే లాంచ్ వెహికల్స్ ఇంటర్‌సెప్టర్‌ను మోసుకెళ్లి లాంచ్ చేస్తాయి.

  • అదేవిధంగా, రాడార్ సాంకేతికతలు 870 నుండి 3,000 కి.మీ పరిధిలో బెదిరింపులను గుర్తించగలవు. అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థలు ఇంటర్‌సెప్టర్ల ప్రయోగ, లక్ష్యాన్ని సమన్వయం చేస్తాయి.

 

చర్చలే కీలకం.. 
THAAD, Patriot లాంటి వ్యవస్థలు బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా, వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో బలహీనతలు బయటపడ్డాయి. ఈనేపథ్యంలో పొరుగు దేశాలతో శాంతి ఒప్పందాలు, చర్చలు, పరస్పర అవగాహన క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఉపయోగపడనుంది. అలాగే, గల్ఫ్ దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తే భద్రతా వ్యవస్థలు మరింత బలపడతాయి. ఇదే సమయంలో స్వదేశీ సాంకేతికత, స్థానిక రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తే ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)