Breaking News

ఇరాన్‌, పాకిస్తాన్‌ మధ్య మళ్లీ హై టెన్షన్‌ !

Published on Sat, 02/24/2024 - 08:21

టెహ్రాన్‌: ఇరాన్‌,పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్‌ మిలిటెంట్‌ కమాండర్‌తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్‌ భూ భాగంలో ఇరాన్‌ ఆర్మీ దాడిచేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని సిస్తాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ కేంద్రంగా 2012లో జైష్‌ అల్‌ అదిల్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి.

కొన్నేళ్ల తర్వాత ఈ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్‌ భద్రతాబలగాలపైనే దాడులు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో సిస్తాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో 11  మంది పోలీసులు చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని జైష్‌ అల్‌ అదిల్‌ ప్రకటించుకుంది. గత నెలలో పరస్పరం మిసైల్‌ దాడులకు దిగడంతో ఇరాన్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  

ఈ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం విషయమై ఒప్పందం కూడా జరిగింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు. ఈ నేపథ్యంలో జైష్‌ అల్‌ అదిల్‌ టెర్రరిస్టులపై పాకిస్తాన్‌ భూభాగంలో ఇరాన్‌ బలగాల దాడి మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఇదీ చదవండి.. రష్యాపై భారీ ఆంక్షలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)