Breaking News

ఇండోనేషియాలో వరద భీభత్సం.. 16 మంది మృతి..!

Published on Wed, 01/07/2026 - 01:03

ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటికే దాదాపు 16 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు వేలాదిమందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. 

ఇండోనేషియాలో తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన వివరాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం తెల్లవారుజామున నదుల్లో జలపాతం అకస్మాత్తుగా పెరిగింది. ఈ బలమైన నది ప్రవాహాలకు సియావు టాగులాండాంగ్ బియారో జిల్లాలోని గ్రామాల కొట్టుకుపోయాయి. ఈ వరదలు అనేక గ్రామాలను ముంచెత్తాయి.

సులవేసి ద్వీపం నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియావు ద్వీపంలోని నాలుగు ప్రభావిత గ్రామాలకు పోలీసులు, సైన్యం మద్దతుతో రెస్క్యూ బృందాలను మోహరించారు. అయితే దెబ్బతిన్న రోడ్లు, కమ్యూనికేషన్ అంతరాయం వల్ల రెస్క్యూ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ వరదల్లో దాదాపు ఏడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 140 కి పైగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి మరింత దిగజారడంతో ప్రజలను చర్చిలు, ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించారు. 

 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)