Breaking News

భారత జాలర్లపై శ్రీలంక జవాన్ల కాల్పులు

Published on Wed, 01/29/2025 - 05:20

న్యూఢిల్లీ: శ్రీలంక సరిహద్దు సముద్రజలాల సమీపంలో చేపలవేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారుల(Indian Fishermen)పై శ్రీలంక నావికాదళ సభ్యులు కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జీవనోపాధి కోసం వచ్చిన జాలర్లపై గస్తీదళాల కాల్పుల ఘటనను భారత్‌ సీరియస్‌గా తీసుకుంది. మిత్రదేశ పౌరులపై శత్రువుల తరహాలో కాల్పులు జరపడమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి శ్రీలంక రాయబారిని పిలిపించి ఆయన ఎదుట తీవ్ర నిరసన వ్యక్తంచేసింది.

‘‘క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాసరే బలగాలు ఆయుధాలకు పనిచెప్పడం లాంటి అసాధారణ చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఇలాంటివి పునరావృతమైతే శ్రీలంకతో సత్సంబంధాల కొనసాగింపుపై మేం మరోసారి తీవ్రంగా సమీక్ష జరపాల్సి ఉంటుంది’’ అని భారత్‌ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.

అసలేం జరిగింది?
మంగళవారం తెల్లవారుజామున శ్రీలంక సమీపంలోని డెల్ఫ్‌ట్‌ ద్వీపం సమీప సముద్రజలాల్లో 13 మంది భారతీయ జాలర్లు చేపలు పడుతుండగా అక్కడికి శ్రీలంక నావికాదళంలోని గస్తీ బృందం చేరుకుంది. ఇక్కడ చేపలు పట్టే అధికారం భారతీయులకు లేదంటూ ఆ జాలర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు. అయితే అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన జాలర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గర్లోని జాఫ్నా టీచింగ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెల్సుకున్న జాఫ్నాలోని భారత కాన్సులేట్‌ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి జాలర్ల ఆరోగ్యం గురించి వాకబుచేశారు. అత్యుత్తమ చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)