మృత్యువు అంచునుంచి..

Published on Fri, 12/12/2025 - 18:26

అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్, టల్లీ ఎయిర్‌ పోర్ట్‌.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్‌ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్‌’ విమానం 15,000 అడుగుల (సుమారు 4,500 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కైడైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్‌ జంప్‌ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది.. విమానం తలుపు వద్ద నిల్చున్న స్కైడైవర్‌ ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ గుండె వేగం పెరిగింది. 

విమానం నుంచి బయటికి దూకడానికి సెకన్‌ మాత్రమే ఉంది.. కానీ, ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా, అతని రిజర్వ్‌ పారాచూట్‌ తాడు విమానం రెక్క ఫ్లాప్‌ను తాకింది. అంతే.. కళ్లు మూసి తెరిచేలోపే, పారాచూట్‌ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గూసన్‌ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను.. విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్‌ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్‌ వెంటనే విమానం నుంచి బయటకు దూకి, అదుపులేని ఫ్రీ–ఫాల్‌లో పడిపోయాడు. 

అసాధారణ ధైర్యశాలి
కళ్లు మూసి తెరిచేలోపే, ఫెర్గూసన్‌ కాళ్లు విమానం తోక భాగంలోని ’హారిజాంటల్‌ స్టెబిలైజర్‌’కు బలంగా తగిలాయి. అంతలో, తెరుచుకున్న పారాచూట్‌ మొత్తం తోకకు చుట్టుకుపోయింది! ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అనిపించింది. 15,000 అడుగుల ఎత్తులో.. ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ విమానం తోకకు వేలాడుతూ, చావు అంచున చిక్కుకుపోయాడు. అతని ముఖంలో మృత్యు భయం స్పష్టంగా కనిపించింది. కింద అగాధం.. పైన మృత్యుపాశం.. పట్టు తప్పితే ప్రాణాలు దక్కవు. ఆ ప్రమాదకర స్థితిలో, ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ భయంతో వణికిపోకుండా, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం.. చేతిలో ఉన్న చిన్న హుక్‌ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్‌ మృత్యువుతో పోరాడాలి. 

ప్రాణం కాపాడిన కత్తి
ఆడ్రియన్‌ తన వద్ద ఉన్న చిన్న ’హుక్‌ కత్తి’ తీశాడు. వేలాడుతూనే.. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్‌ పారాచూట్‌ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఇది సాహసం కాదు, ఆత్మరక్షణ! ఆఖరికి 11 లైన్లను తెగ్గొట్టగలిగాడు. చివరికి, చిరిగిన పారాచూట్‌లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే, ఆడ్రియన్‌ తన ప్రధాన పారాచూట్‌ను తెరిచాడు. రిజర్వ్‌ పారాచూట్‌ అవశేషాలు అడ్డుప డినా, అది పూర్తిస్థాయిలో విచ్చుకుంది. చివరకు, ఫెర్గూసన్‌ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్‌ అయ్యాడు.

 

మధుమేహులకు గుడ్‌ న్యూస్‌ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది
 

ప్రమాదంలో విమానం..
ఇంతలో పైన విమానం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. పారాచూట్‌ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో, పైలట్‌ కొంతవరకు విమానంపై నియంత్రణ కోల్పోయాడు. వెంటనే, ఆయన ’మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపారు. తోకకు చిక్కుకున్న పారాచూట్‌తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించినా, బ్రిస్బేన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సాయంతో, పైలట్‌ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని టల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయగలిగాడు. కానీ తోక భాగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది.

 

శభాష్‌ ఫెర్గూసన్‌!
ఈ ఏడాది సెప్టెంబర్‌ 20న జరిగిన ఈ అసాధారణ ఘటనపై ఆస్ట్రేలియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బ్యూరో (ఏటీసీబీ) దర్యాప్తు జరిపి, ఈ ఉత్కంఠభరితమైన వీడియోను విడుదల చేసింది. ఏటీసీబీ ముఖ్య కమిషనర్‌ ఆంగస్‌ మిచెల్‌ మాట్లాడుతూ, ‘హుక్‌ కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ, రిజర్వ్‌ పారాచూట్‌ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడింది’.. అని ఫెర్గూసన్‌ సమయస్ఫూర్తిని ప్రశంసించారు.  పదిహేను వేల అడుగుల ఎత్తులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫెర్గూసన్‌ సాహసం, ఆత్మవిశ్వాసం ప్రపంచ స్కైడైవింగ్‌ చరిత్రలో ఒక పాఠ్యాంశంగా నిలిచిపోయింది.

ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)