Breaking News

పహల్గాం ఉగ్రదాడిని  ఖండించిన ఎస్సీఓ

Published on Tue, 09/02/2025 - 03:20

తియాంజిన్‌: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యదేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి డిక్లరేషన్‌ విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం, సానుభూతి ప్రకటించారు. 

ఈ హేయమైన ఘటనకు కారణమైన ముష్కరులను, వారి పోషకులను, కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇలాంటి ఘాతుకాలను సహించడానికి ఎంతమాత్రం వీల్లేదన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరాటానికి కట్టుబడి ఉన్నామని వారు ఉద్ఘాటించారు. ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద శక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయానికొచ్చారు. అలాంటి శక్తులను స్వలాభం కోసం ఎవరూ వాడుకోకుండా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. 

బెల్డ్‌ అండ్‌ రోడ్‌ను తప్పుపట్టిన మోదీ 
చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ కార్యక్రమం(బీఆర్‌ఐ) పట్ల  ఎస్సీఓ సదస్సు వేదికగా ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు ఇతర దేశాల జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని చెప్పారు. ఏ కార్యక్రమం అయినా సరే నమ్మకం, విశ్వసనీయత పెంచుకొనేలా ఉండాలి తప్ప తగ్గించుకొనేలా ఉండొద్దన్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ను అనుసంధానిస్తూ బీఆర్‌ఐని చైనా ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) గుండానే వెళ్తోంది. దీన్ని భారత్‌ మొదటి నుంచీ                వ్యతిరేకిస్తోంది.    
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)