Breaking News

ఇరాన్‌ చేరుకున్న రష్యా ప్రళయ విమానం

Published on Mon, 07/13/2026 - 20:08

టెహ్రాన్: ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఆదివారం నాడు ఇరాన్‌లోని తమ మిలటరీ స్థావరాలపై అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా  కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి Tu-214PU 'డూమ్స్‌డే' (ప్రళయ) విమానాన్ని టెహ్రాన్‌కు పంపింది. ఈ చర్య ద్వారా ఇరాన్‌కు మాస్కో బహిరంగంగానే తమ అండను ప్రకటించినట్లయింది.

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ముగింపుకు రాలేదు. ఇరు దేశాలు చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించే లోపే, పరిస్థితులు తిరిగి మొదటికి వచ్చాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్న ఈ తరుణంలో, రష్యా ఇరాన్‌కు ఒక అత్యాధునిక విమానాన్ని పంపడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 ఏ విధంగా ఉపయోగం
ఇరాన్‌కు అమెరికా నుంచి దాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ విమానం ఇరాన్ గగనతలంలో నిరంతరం నిఘా ఉంచుతోంది. అమెరికా యుద్ధ విమానాలు లేదా క్షిపణులు దూసుకొస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ముందే అప్రమత్తం చేస్తోంది.ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ విమానం ఇప్పుడు ఇరాన్‌కు చేరుకోవడం హాట్‌టాఫిక్‌గా మారింది. దీని రాకతో ఇరాన్‌కు రక్షణ పరంగా మరింత బలం చేకూరిందనేది వాస్తవం.

Tu-214PU ప్రత్యేకతలు
ఇది సాధారణ విమానం కాదు. ఇందులో అత్యంత సురక్షితమైన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్, కంట్రోల్ నెట్‌వర్క్‌లు, ప్రత్యేక డేటా లింక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సదుపాయాల వల్ల సంక్షోభ సమయాల్లో విమానంలో ప్రయాణిస్తూనే యుద్ధ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే దీనిని రష్యా "ప్రళయ విమానం" అని పిలుస్తుంది.

భూమిపై అణు దాడులు సంభవించినప్పుడు దేశ అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఈ విమానంలోకి ఎక్కి ఆకాశం నుంచే యుద్ధ వ్యూహాలను రచించవచ్చు. కాక్‌పిట్ మినహా ఈ విమానానికి ఎలాంటి కిటికీలు ఉండవు. ఇది అణు విస్ఫోటనం వల్ల వచ్చే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాల నుండి లోపల ఉన్నవారిని రక్షిస్తుంది. అలాగే ఆకాశంలోనే దీనికి ఇంధనం నింపే సదుపాయం ఉండడం వల్ల, వరుసగా కొన్ని రోజుల పాటు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ప్రయాణించగలదు.

అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఈ విమానం రష్యాలో చాలాసార్లు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)