Breaking News

అమెరికా అడ్డుపడుతుంది: రష్యా

Published on Tue, 02/10/2026 - 16:52

కీవ్‌: డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్‌పై అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు తగ్గించారు. దానికి ప్రతీగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసిందన్నారు. అయితే భారత్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లవ్రోవ్ తొలిసారిగా ట్రంప్ వైఖరిపై స్పందించారు.

ఇటీవలే ట్రంప్ తిరిగి భారత్‌కు స్నేహహస్తం అందిస్తున్నారు. ఇంతకాలం భారత్‌ను తన అంగబలం ఆర్థికబలంతో గుప్పిట్లో పెట్టుకుందామనుకున్న ట్రంప్ అది కుదరదనే తెలిసాక తిరిగి రాజీ బాట పట్టారు. భారత్ ఎగుమతులపై అమెరికా పెంచిన అధిక పన్నులను తగ్గిస్తున్నామని ప్రకటించారు. భారత్ సైతం దీనికి సానూకూలంగా స్పందించి ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ సమయంలో ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిందని అన్నారు. అయితే ఈ స్టేట్‌మెంట్‌పై భారత్ స్పందించలేదు. తాజా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ వ్రోవ్ ఈ అంశంపై స్పందించారు.

సెర్గీయో లవ్రోవ్ మాట్లాడుతూ" ఉక్రెయిన్ సమస్య  పరిష్కరించాలని వారు  మాకు చెబుతున్నారు. మేము అమెరికా ప్రతిపాదనను అంగీకరించాము. అమెరికా స్థానం మాకు ముఖ్యమైనది. అయితే వారేమో కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. సముద్ర చట్టాలపై ఉన్న UN కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తూ బహిరంగ సముద్రంలో ట్యాంకర్లపై యుద్ధం జరుపుతున్నారు. భారత్, ఇతర భాగస్వాములు చౌకైన రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తున్నారు. అధిక ధరలకు US, LNG  సహజ వాయువు కొనుగోలు చేయమని వారిని బలవంతం చేస్తున్నారు ” అని సెర్గీ లవ్రోవ్ అన్నారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆర్థికంగా అధిపత్యం సాధించేందుకు ప్రపంచ దేశాలపై పన్నుల ఆంక్షలతో విరుచుకపడుతున్నారని తెలిపారు. అయితే భారత్, చైనా, కెనడా వంటి దేశాలతో సహాకారం అందిస్తూనే మనం ఈ అమెరికా అ‍డ్డంకులను ఎదుర్కోవాలని సెర్గియో లవ్రోవ్ పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారని అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని  సెర్గియో లవ్రోవ్ అన్నారు. అధిక ధరలకు చమురు కొనుగోలు చేస్తే ప్రజలపై భారం పడుతుంది కనుక దేశప్రజల ప్రయోజనాలే ఆ దేశానికి ప్రథమంగా ఉండాలని రష్యా విదేశాంగశాఖ మంత్రి తెలిపారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)