Breaking News

ఆంక్షలతో  లొంగదీసుకోలేరు 

Published on Thu, 09/04/2025 - 09:11

మాస్కో: భారత్, చైనాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, ఆంక్షలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తప్పుపట్టారు. ఆ రెండు దేశాలను ఆంక్షల కొరడాతో లొంగదీసుకోవాలని చూడడం సరైంది కాదని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్, చైనాలతో మాట్లాడే విధానమే సరిగ్గా లేదని, వలసవాద పాలన కాలం నాటి మాటలను ట్రంప్‌ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పుతిన్‌ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

అమెరికా సర్కార్‌ వైఖరిపై ఘాటుగా స్పందించారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచి, దారికి తెచ్చుకోవాలని చూస్తే అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. భారత్, చైనాలు చక్కటి భాగస్వామ్య దేశాలని పుతిన్‌ గుర్తుచేశారు. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను ఆ  రెండు దేశాల్లో నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అభివర్ణించారు. 

భారత్, చైనాలు కలిసి అమెరికాను శిక్షిస్తాయని ఎవరైనా చెబితే ఆ విషయం సీరియస్‌గా ఆలోచించాల్సిందేనని ట్రంప్‌ ప్రభుత్వానికి సూచించారు. 140 కోట్లకుపైగా జనాభా ఉన్న ఇండియాను, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను బలహీన దేశాలుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. వలసవాద ప్రభుత్వాల హయాం ఎప్పుడో ముగిసిపోయిందని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు అప్పుటి పదజాలం ఉపయోగిస్తామంటే కుదరదని, ఈ విషయం అమెరికా తెలుసుకోవాలని హితవు పలికారు. అమెరికా, భారత్, చైనాల మధ్య మళ్లీ సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న నమ్మకం తనకు ఉందని పుతిన్‌ స్పష్టంచేశారు.      

కారులో మోదీతో సంభాషణ రహస్యం కాదు  
చైనాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్‌ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కారులోనే 45 నిమిషాలకుపైగా మాట్లాడుకున్నారు. దీనిపై వస్తున్న ఊహాగానాలపై పుతిన్‌ స్పందించారు. మోదీతో కారులో సంభాషించడం వెనుక రహస్యం ఏమీ లేదన్నారు. అది రహస్య సంభాషణ కాదని స్పష్టంచేశారు. అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీ విశేషాలను మోదీకి వివరించానని చెప్పారు.       
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)