Breaking News

400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

Published on Sat, 06/07/2025 - 08:23

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ  ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్‌ ‘ఆపరేషన్ స్పైడర్‌వెబ్‌’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భీకరదాడి చేసింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్‌తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్  ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం  కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌లో  ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్‌లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్‌లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని,  పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్‌ఎన్‌) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ  సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్  ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇది  కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్‌.. ‘సింధు ఒ‍ప్పందం’పై వేడుకోలు

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)