Breaking News

పేరుకే ‘మిల్లీమీటర్‌’.. ఎలాన్‌ మస్క్‌ను టార్గెట్‌ చేస్తున్న పుతిన్‌

Published on Tue, 12/23/2025 - 03:24

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొత్త మలుపు తిరగనున్నట్లు నాటో ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతు అందిస్తున్న ఎలాన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ శాటిలైట్లను నిర్వీర్యం చేసేందుకు రష్యా మిల్లీమీటర్‌ పరిమాణంలో ఉండే పెల్లెట్లను తయారు చేస్తోందని, రానున్న రోజుల్లో ఈ శాటిలైట్లను కూల్చే ప్రయత్నం చేయనున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.

నాటోకు చెందిన రెండు దేశాల గూఢచారి సంస్థలు రష్యా కొత్త యాంటీ శాటిలైట్‌ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఆయుధం ఎలాన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 

‘జోన్‌ ఎఫెక్ట్‌’గా పేర్కొంటున్న ఈ విధానం కక్ష్యలో మిల్లీమీటర్‌ పరిమాణంలో ఉన్న లోహపు కణాలను భారీగా విడుదల చేసి, ఉపగ్రహాలను ఢీకొట్టేలా చేస్తుంది. దీంతో ఒకేసారి అనేక ఉపగ్రహాలు నిర్వీర్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా వంటి దేశాల ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ప్రస్తుతం లో-ఎర్త్‌ ఆర్బిట్‌లో ఉన్న ఉపగ్రహాలలో స్టార్‌లింక్‌ వాటా చాలా గణనీయమైనది. ఉక్రెయిన్‌ యుద్ధంలో కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌ సేవలు, సైనిక ఆపరేషన్లకు ఇవి కీలకంగా ఉపయోగపడుతున్నాయి. స్టార్‌లింక్‌ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరిగితే అంతరిక్షంలో గందరగోళం పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. ఈ కారణంగా రష్యా దీన్ని ప్రయోగించే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

రష్యా అభివృద్ధి చేస్తోందని అనుమానిస్తున్న ఈ యాంటీ శాటిలైట్‌ విధానం అంతరిక్ష భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చని, స్టార్‌లింక్‌పై దృష్టి పెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశం ఉన్నట్టుగా నాటో ఇంటెలిజెన్స్‌ సూచిస్తోంది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)