వెలుగులోకి ఘోరాలు.. రష్యాపై షాకింగ్‌ ఆరోపణలు

Published on Thu, 07/30/2026 - 13:54

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో మరో భయానక అంశం వెలుగులోకి వచ్చింది. యుద్ధ ఖైదీలు, సాధారణ పౌరులపై రష్యా బలగాలు లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖైదీలను అవమానించడం, మానసికంగా దెబ్బతీయడం, ప్రతిఘటనను పూర్తిగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు.

మాజీ ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు, ఐక్యరాజ్యసమితి పరిశోధకులు, ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్ల వాంగ్మూలాల ఆధారంగా.. అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సంచలనాత్మక కథనం ప్రచురించింది. 2022లో రష్యా పూర్తిస్థాయి దాడులు ప్రారంభించిన తర్వాత ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొంది.

మానసికంగా కుంగదీసే వ్యూహం?
ఉక్రెయిన్‌కు చెందిన మాజీ ఖైదీ సెర్హీ బోయ్‌చుక్‌ తన అనుభవాలను వివరిస్తూ.. రష్యా నిర్బంధంలో ఉన్న సమయంలో చిత్రహింసలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తనను శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా కూలదోసేందుకు లైంగిక హింసను ఉపయోగించారని ఆరోపించాడు. ఇలాంటి ఘటనలు ఒక్కరి అనుభవమే కాదని.. పలువురు మాజీ యుద్ధ ఖైదీలు కూడా ఇలాంటి ఆరోపణలే చేసినట్లు చెప్పాడు. లైంగిక హింసను శత్రువులను అవమానించే, భయపెట్టే, మానసికంగా బలహీనపరిచే వ్యూహంగా ఉపయోగిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.

ఎక్కువ బాధితులు ఎవరంటే.. 
సాధారణంగా యుద్ధాల్లో లైంగిక హింసకు మహిళలు, చిన్నారులే ఎక్కువగా గురవుతుంటారు. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో పురుష యుద్ధ ఖైదీలపై ఇలాంటి దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఉన్న లైంగిక హింసకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ శాతం బాధితులు పురుషులేనని వెల్లడైంది. రేప్‌, సామూహిక లైంగిక దాడులు, జననాంగాలపై హింస, విద్యుత్‌ షాక్‌లు, శారీరక చిత్రహింసలకు గురిచేసినట్లు పలువురు బాధితులు వెల్లడించారు. కొంతమంది ఖైదీలను నగ్నంగా నిలబెట్టడం, అవమానకర పరిస్థితుల్లో ఉంచడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

రష్యా స్పందన ఏంటి?
అయితే ఈ ఆరోపణలపై రష్యా అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలను మాస్కో ఖండిస్తూ.. అవి రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న నిరాధార ఆరోపణలని పేర్కొంది. అంతేకాకుండా ఆక్రమిత ప్రాంతాల్లో ఐరాస దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి.

అసలు తీవ్రత ఎంత?
లైంగిక హింసకు సంబంధించిన వాస్తవ ఘటనల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఉక్రెయిన్‌ అధికారులు భావిస్తున్నారు. సామాజిక అవమానం, ప్రతీకార భయం కారణంగా చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ప్రకారం.. రష్యా సైనికులపై వందల సంఖ్యలో లైంగిక హింస కేసులపై విచారణ జరుగుతోంది. ఇందులో పురుష బాధితుల సంఖ్య కూడా గణనీయంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

యుద్ధాల్లో ఆయుధాలు, బాంబులు మాత్రమే కాదు.. మనుషుల మనోధైర్యాన్ని దెబ్బతీసే పద్ధతులు కూడా వినియోగించబడుతున్నాయన్న దానికి ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై తుది నిర్ధారణకు అంతర్జాతీయ దర్యాప్తులు కీలకంగా మారనున్నాయి.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)