Breaking News

బీరుట్ గగనతలంలో భారీ ఎయిర్ ఫోర్స్ రద్దీ.. ఏం జరగబోతుంది..?

Published on Fri, 12/19/2025 - 00:22

లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో ఇటీవల భారీ ఎయిర్ ఫోర్స్ రద్దీ కనిపిస్తోంది. స్థానికులు వరుసగా ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాల కదలికలను గమనిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఏం జరుగబోతుందోనని లెబనాన్‌ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నట్లు సమాచారం.

ఎందుకీ ఆందోళన..?
లెబనాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుంది. సరిహద్దు నియంత్రణ, ప్రాంతీయ రాజకీయాల నేపథ్యంలో 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసింది. ఈ దాడికి వ్యతిరేకంగా లెబనాన్‌లో ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా హిజ్బుల్లా అనే సంస్థ ఏర్పడింది. హిజ్బుల్లా లెబనాన్‌లోని షియా ముస్లింలకు ఆధారంగా ఏర్పడి, ఇరాన్ మద్దతుతో బలపడింది. ప్రస్తుతం హిజ్బుల్లా లెబనాన్‌లో శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తిగా మారింది.

ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో సైనిక ఉనికిని కొనసాగించడం, హిజ్బుల్లా దానిని ప్రతిఘటించడం ద్వారా వివాదం తీవ్రరూపం దాల్చింది. 2024 నవంబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, అప్పుడప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి.

ఇటీవలే (డిసెంబర్ 9న) ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. మౌంట్ సఫీ, జ్బా, జెఫ్టా వ్యాలీ ప్రాంతాల్లో జనావాసాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది.  తాజాగా ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు మరోసారి తమ గగనతలంలో సంచరిస్తుండటంతో లెబనాన్‌ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)