Breaking News

పాక్‌కు పుతిన్ మెసేజ్..భారత్‌కు దూరం కానున్న రష్యా?

Published on Sun, 02/08/2026 - 19:48

భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్‌కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్‌ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్‌కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్‌ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.

రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్‌కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్‌ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు  రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో ‍అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.

అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్‌పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్‌ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది.  భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.

ఇదిలా ఉండగా రష్యా పాక్‌తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్‌ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు.  కాగా ఇప్పుడు రష్యా పాక్‌తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్‌లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.

పుతిన్ మెసేజ్‌లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్‌లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్‌తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్‌తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)