Breaking News

పుతిన్‌ పిలిచారు.. ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెర పడ్డట్లేనా?

Published on Thu, 12/28/2023 - 07:52

మాస్కో: మూడో ఏడాదిలోకి అడుగుపెట్టక ముందే.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగియనుందా? శాంతి స్థాపనలో భారత్‌ పెద్దన్న పాత్ర వహించబోతోందా?.. తాజా పరిణామాలు అందుకు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ముగించేందుకు ముందుకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం అందించారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో క్రెమ్లిన్‌లో జైశంకర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్‌ సంక్షోభం సహా పలు అంశాలపై వీళ్లు చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీని రష్యా పర్యటనకు పుతిన్‌ ఆహ్వానించారు. ‘‘మా చిరకాల మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు మేం ఆత్రుతతో ఉన్నాం. ఆయన్ని మా దేశానికి ఆహ్వానిస్తున్నాం. ఉక్రెయిన్‌ పరిణామాల్ని నేను ఆయనకు( భారత ప్రధాని మోదీ) ఎప్పటికప్పుడు వివరిస్తుంటాను. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. సమస్యను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడటానికి ఆయన తన శాయశక్తులా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా’’ అని జైశంకర్‌ వద్ద పుతిన్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


ఉక్రెయిన్‌ సంక్షోభానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక చక్కని పరిష్కారం చూపగలరని తొలి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భావిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై తరచూ ఇరు దేశాల నేతలు చర్చించుకుంటున్నారనే విషయాన్ని జైశంకర్‌  మీడియాకు తెలిపారు. ఈ తరుణంలో  మోదీకి పుతిన్‌ ఆహ్వానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పుతిన్‌ ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది వేసవి లోపు.. వీలైతే ఫిబ్రవరిలోపే మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే విజయాన్నిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కూడా ప్రెస్‌మీట్‌లో ధృవీకరించారు కూడా.    

ఇక.. భారత్‌-రష్యాల ద్వైపాక్షిక ఒప్పందాలు.. ఇతర సంబంధాల బలోపేతం కోసం జైశంకర్‌ రష్యాలో పర్యటిస్తున్నారు. పుతిన్‌తో భేటీకి ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జైశంకర్‌ విడిగా భేటీ అయ్యారు. అంతకు ముందు.. ఇరుదేశాల ఆర్థిక సంబంధిత ఒప్పందాలకు సంబంధించి రష్యా ఉప ప్రధాని డెనిస్‌తో సమావేశం అయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)