Breaking News

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బంగ్లాలో నిరసన

Published on Tue, 12/09/2025 - 21:48

1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్‌తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలకు గుర్తుగా ఈ ప్రదర్శనలు  చేపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.

బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు గుర్తుగా  ఆదేశ విద్యార్థులు పెద్దఎత్తున సంఘీభావ కార్యక్రమం చేప్టటారు.ఆ రోజు జరిగిన పోరాటంలో ఎంతో మంది పాకిస్థాన్ కుట్రలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971లో పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడానికి రజాకార్ అనే మిలిషీయా గ్రూపును ఏర్పాటు చేశారని దాని ఆ మిలిటెంట్లు అంతర్గతంగా ఎంతో విధ్వంసం సృష్టించారని అన్నారు.

రజాకార్లు ప్రజలను చిత్రహింసలు పెట్టడంతో పాటు పెద్దఎత్తున ఇళ్లలో లూటీ చేశారని, సామూహికంగా చాలామందిని హత్యచేశారని స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తూ తీవ్రఆగడాలకు పాల్పడ్డారని తెలిపారు. వీళ్లకు పాకిస్థాన్ ఆర్మీతో పాటు ఇతర ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేయన్నారు. రజాకార్ల కుట్రలకు చాలా మంది స్వతంత్ర్య పోరాట యోధులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ విమోచన పోరాటం 1971 మార్చి-డిసెంబర్ మధ్య జరిగింది. ఈ పోరాటానికి షేక్ ముజిబూర్ రహ్మాన్ నాయకత్వం వహించారు.ఈ యుద్ధంలో ఇండియా బంగ్లాకు అన్ని విధాలుగా సహాయం అందించింది.  అంతేకాకుండా  డిసెంబర్ 3న అధికారంగా రణ క్షేత్రంలో దిగి 13రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీని ఓడించింది. దీంతో డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.

బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు, ఆదేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హాసీనా ఆయన కుమార్తె. బంగ్లాదేశ్‌లో అల్లర్ల చెలరేగడంతో ప్రస్తుతం షేక్ హాసీనా భారత్‌లో  భారత్‌లో తలదాచుకుంటుంది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)