Breaking News

మోదీ నా సోదరుడు: నెతన్యాహు

Published on Wed, 02/25/2026 - 16:33

టెలీఅవీవ్: ధాని మోదీకి ఇజ్రాయెల్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ పార్లమెంటు మోదీకి ఘన స్వాగతం పలికింది. కాగా ఈ రోజు ప్రధాని మోదీ రెండురోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుతో కలిసి  ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. 

ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ భారత్‌కు నిజమైన స్నేహితుడు, కష్టకాలంలో భారత్‌కు అండగా నిలిచారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ మాకు  భాగస్వామి. ఇక్కడ పర్యటించడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్- భారత్ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా కష్టాలు పడుతున్నాయి. ఇక్కడి పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా", అని అన్నారు. 

అనంతరం ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ  "ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు. మోదీ ఇజ్రాయోల్ పర్యటన ఎంతో సంతోషదాయకం. మోదీ నాకు స్నేహితుడి కంటే ఎక్కువ నా సోదరుడి లాంటి వాడు." అని నెతన్యాహు అన్నారు. భారత్‌ని మోదీ వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కాలంలో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయన్నారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.  ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. అనంతరం రణక్షేత్రంగా మారిన గాజా అంశం సైతం ఇరు దేశాధినేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. మరోవైపు ఇరాన్‌- అమెరికా ఉద్రిక్తల వేళ  పశ్చిమాసియాలో  మోదీ పర్యటించడం ప్రాధాన్యత   సంతరించుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి మోదీకి,  నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్‌ విందు ఇవ్వనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)